‘గాంధీ టాక్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మూవీ టీమ్

by I. Sairam |

స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), అరవింద్ స్వామి(Arvind Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’(Gandhi Talks).

‘గాంధీ టాక్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), అరవింద్ స్వామి(Arvind Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’(Gandhi Talks). కిషోర్ పి.బేలేకర్(Kishore P Belekar) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బేలేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో అందాల నటి అదితి రావు హైద(Aditi Rao Hydari), మరాఠీ నటుడు సిద్ధార్థ్ జాదవ్(Siddharth Jadhav) కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఇది మూకీ సినిమా అయినప్పటికీ.. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ మరియు మలయాళ భాషల్లో టైటిల్ కార్డులు, ప్రమోషన్లతో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మూవీ టీమ్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జీ స్టూడియోస్’ ఈ చిత్రాన్ని గాంధీజీ వ‌ర్థంతి సంద‌ర్భంగా జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

మాటలు లేని ఈ సినిమాలో సంగీతమే ప్రాణం. అందుకే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందిస్తున్నాడు. కాగా ఈ మూవీలో మాటలు లేకపోయినా, కేవలం నటీనటుల హావభావాలు మరియు సంగీతంతోనే కథను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. మరి థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా మెప్పించనుందో చూడాల్సి ఉంది.

Link

Next Story