- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Game Changer: ఇట్స్ అఫీషియల్.. ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..? (పోస్ట్)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక గేమ్ ఛేంజర్ భారీ అంచనాల నడుమ శుక్రవారం (జనవరి 10న) థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురు చూశారు. మరి ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం..
ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. తొలిరోజు గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఇది గేమ్ ఛేంజింగ్ బ్లాక్ బస్టర్ అంటూ రాసుకొచ్చారు. మరి వీకెండ్ కావడంతో శని, ఆది వారాల్లో భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ ఫస్ట్ డే రూ.172 కోట్లు రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






