- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ టీంకు షాక్.. సినిమా లీక్ చేస్తామని బెరింపులు
గేమ్ చేంజర్(Game Changer) మూవీ టీంకు కొందరు వ్యక్తుల బెదిరింపులు(Threats) వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: గేమ్ చేంజర్(Game Changer) మూవీ టీంకు కొందరు వ్యక్తుల బెదిరింపులు(Threats) వచ్చాయి. డబ్బులు ఇవ్వకపోతే సినిమా పైరసీ(Pirated) చేసి సోషల్ మీడియాలో రిలీజ్(Released) చేస్తామని నిందితులు వార్నింగ్(warned) ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Sensational director Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకొని, వరల్డ్ వైడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
అయితే ఈ మూవీని సోషల్ మీడియాలో హెచ్‌డీ ప్రింట్ రిలీజ్ చేస్తామని టీంను కొందరు వ్యక్తులు బెదిరిస్తూ.. డబ్బులు డిమాండ్ చేశారు. అంతేగాక సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను సోషల్ మీడియాలో రాసి, ఆ పోస్టులను మూవీ యూనిట్ కి పంపారు. అలాగే గేమ్ ఛేంజర్ మూవీ హెచ్‌డీ ప్రింట్.. రీట్వీట్ కొట్టు.. లింకు పట్టు అని ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ లింక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారు. దీనిపై మూవీ టీం స్పందించకపోవడంతో కేటుగాళ్లు గేమ్ ఛేంజర్ పైరసీ ప్రింట్ ని లీక్ చేశారు. దీంతో మూవీ టీం సైబర్ క్రైం పోలీసులను(Cybercrime Police) ఆశ్రయించారు. ఆధారాలు, పేర్లతో సహా 45 మందిపై గేమ్ ఛేంజర్ యూనిట్ కేసు నమోదు చేశారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు లింక్ అడ్రస్ లను ఇంటర్ నెట్ నుంచి డిలీట్ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.






