ఆనంద్ దేవరకొండ సినిమా.. స్పెషల్‌ హైలైట్‌గా గద్దర్, గోరటి వెంకన్న (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-01 13:07:51  IST  )

ఆనంద్ దేవరకొండ సినిమా.. స్పెషల్‌ హైలైట్‌గా గద్దర్, గోరటి వెంకన్న (వీడియో)

ఆనంద్ దేవరకొండ సినిమా.. స్పెషల్‌ హైలైట్‌గా గద్దర్, గోరటి వెంకన్న (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కల్ట్ క్లాసిక్ ‘బేబీ’ మూవీ కాంబో రిపీట్ అయింది. ఆనంద్‌ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవీ చైతన్య(Vaishnavi Chaitanya) మరోసారి జతకట్టారు. వీరి ఈ కాంబినేషన్‌లో ‘#90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ని ప్రకటిస్తూ గ్లింప్స్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. #90s వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘ఎపిక్‌’ అని పెట్టారు. ‘ఇది శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి, సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే.. సినిమాలో ఆనంద్‌ దేవరకొండ ప్రజా యుద్ధనౌక గద్దర్ వేషధారణలో కనిపించడం, మరో ఫోక్ సింగర్ గోరటి వెంకన్న పాట సినిమాలో వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్ చూసిన ఫ్యాన్స్ అంతా చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. వీడియో

Next Story