- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaddar Film Awards : ఈనెల 14న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం
తెలంగాణ ప్రభుత్వం(Telangana) అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ అవార్డుల(Gaddar Film Awards) ప్రదానోత్సవం ఈనెల 14న జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana) అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ అవార్డుల(Gaddar Film Awards) ప్రదానోత్సవం ఈనెల 14న జరగనుంది. ఈ మేరకు టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు(TFDC Chairman Dil Raju) మీడియాకు వివరాలు అందించారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద(Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఈ మీడియా సమావేశానికి పలువురు మంత్రులు హాజరు కాలేకపోయారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అవార్డులు అందిస్తున్నామని తెలిపిన దిల్ రాజు.. ఈనెల 14న సాయంత్రం హైదరాబాద్(Hyderabad) లోని హైటెక్స్(Hytex) లో ఈ వేడుక జరుగుతుందని వెల్లడించారు.
2014 నుంచి 2023 వరకు ఎన్నికైన ఒక్కో ఉత్తమ చిత్రానికి ఉత్తమ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లు మొత్తం నాలుగు అవార్డులు అందుకుంటారని తెలిపారు. 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకలకు అందరూ హాజరై, విజయవంతం చేయాలని దిల్ రాజు కోరారు.






