- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Funky: ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు
ఫంకీ సినిమా మార్చి 13వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ తాజాగా ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. కాయాదు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించగా, జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 13వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.
అందులో భాగంగా మార్చి 13వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. పిట్ట గోడ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన అనుదీప్ కేవికి మొదటి సినిమాతో ప్లాప్ దక్కిన ఆ తర్వాత 'జాతి రత్నాలు'తో బ్లాక్ బస్టర్ దక్కింది. కానీ ఈ మూవీ తర్వాత వరుసగా అపజయాలు దక్కుతున్నాయి. కెరియర్ ప్రారంభంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్ కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు.






