- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Funky : స్టేజ్ పైనే డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్
కామెడీ జోనర్ లో వస్తున్న ఈ ఫంకీ సినిమా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో విశ్వక్ సేన్, అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫంకీ. కామెడీ జోనర్ లో వస్తున్న ఈ మూవీలో విశ్వక్ హీరోగా చేస్తుండగా కాయదు లోహర్ హీరోయిన్ గా మెరువనున్నారు. వీకే నరేష్, వీటీవీ గణేష్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమాకు సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.
స్టేజ్ పైన స్టెప్పులు వేసిన హీరోయిన్
కామెడీ జోనర్ లో వస్తున్న ఈ ఫంకీ సినిమా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా అప్డేట్లు వదులుతోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే సాంగ్ లాంచ్ ఈవెంట్ నిన్న నిర్వహించారు. అయితే ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ కాయదు లోహర్ ( Kayadu Lohar ) స్టేజ్ పైన స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకున్నారు. చీర కట్టులోనే ఉన్న ఆమె ఇరగదీసే స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Read More..
‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల






