- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూర్తిగా కోలుకున్న హీరో విశాల్.. న్యూ లుక్స్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం వైరల్ ఫివర్(Viral fever) తో తీవ్ర అనారోగ్యానికి గురైన హీరో విశాల్(Hero Vishal) లుక్స్ అతని అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. దీంతో హాలీవుడ్ హీరోలా ఉండే విశాల్ ఒక్కసారిగా ఇలా మారిపోయాడేంటి అని గూగుల్ లో తీవ్రంగా సెర్చ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల క్రితం వివిధ కారణాల వల్ల ఆగిపోయిన 'మదగజరాజ' ('Madagajaraja') సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సరిగ్గా నిలబడలేని స్థితిలో విశాల్(Vishal) కనిపించడనికి కారణం వైరల్ ఫీవర్ అని, ఆయనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఆయన బయటకు రావడంతో అంతా ఆందోళన చెందారు. అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత హీరో విశాల్(Hero Vishal) పూర్తిగా కోలుకొని(fully recovered) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఆయన కోలుకొని పాత విశాల్ ల కనిపించడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. దీనిని సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పూర్తిగా కోలుకున్న విశాల్(vishal) ఎప్పటిలాగే నడుచుకుంటూ ఓ మాల్ లోకి వెళ్లడం కనిపించింది. అయితే విశాల్ హీరోగా నటించిన 'మదగజరాజ' సినిమా సంక్రాంతి కానుకగా తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.






