సినీ చరిత్రలో మొదటిసారి.. రియల్ సింహంతో పూర్తిస్థాయి సినిమా

by Chukka Sudharani |

పెంపుడు జంతువుల బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటికే ఎన్నో చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేసిన విషయం తెలిసిందే.

సినీ చరిత్రలో మొదటిసారి.. రియల్ సింహంతో పూర్తిస్థాయి సినిమా
X

దిశ, సినిమా: పెంపుడు జంతువుల బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటికే ఎన్నో చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇవన్ని కాస్త గ్రాఫిక్స్ యాడ్ చేసి, లేదా కట్ షాట్స్‌తో తీసివనే. కానీ ఫస్ట్ టైమ్ నిజమైన సింహంతో పూర్తిస్థాయి సినిమా రాబోతోంది. దీనికి కె.సి రవిదేవన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎట్సెటెరా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వి. మతియళగన్, తిత్తిర్ ఫిల్మ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకాంతో నిర్మిస్తున్నారు. ఇందులో నిజమైన సింహంతో కలిసి శ్రుతి రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఇది కేవలం ఒక ప్రాంతీయ చిత్రంగా కాకుండా.. పాన్ ఇండియా రేంజ్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ కోసం మలేషియా, సింగపూర్, థాయిలాండ్, జాంబియా, గోవా వంటి అంతర్జాతీయ లోకేషన్స్‌తో పాటు వైజాగ్ పాంత్రల్లో కూడా చిత్రీకరణ చేయబోతున్నట్లు తెలిపారు. భారతదేశ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించే లక్ష్యంగా ఈ సినిమాను నిర్మాత వి. మతియగళగన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. LinK

Next Story