విజన్ నుండి యాక్షన్ వరకు, రేజింగ్ మిథికల్ థ్రిల్లర్ ప్రారంభమవుతుంది.. ఎగ్జైటెడ్ అప్డేట్ రాబోతుందని హైప్ పెంచేసిన మూవీ టీమ్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్‌ కార్తీక్‌ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు.

విజన్ నుండి యాక్షన్ వరకు, రేజింగ్ మిథికల్ థ్రిల్లర్ ప్రారంభమవుతుంది.. ఎగ్జైటెడ్ అప్డేట్ రాబోతుందని హైప్ పెంచేసిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్‌ కార్తీక్‌ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు. అయితే దీనిని సుకుమార్‌ రైటింగ్స్‌(Sukumar Wrirings)తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘విజన్ నుండి యాక్షన్ వరకు, రేజింగ్ మిథికల్ థ్రిల్లర్ ప్రారంభమవుతుంది.. #NC24 నుండి ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఉత్తేజకరమైన అప్‌డేట్ వస్తుంది.. చూస్తూ ఉండండి’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తారో తెలియాలంటే ఈవెనింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Next Story