- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై అలాంటి పాత్రలు చేయడమే నా లక్ష్యం.. సినీ ప్రయాణంపై మమిత కామెంట్స్
సినిమాలు కేవలం డబ్బు, పేరు కోసం కాకుండా.. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలన్నదే నా ప్రధాన లక్ష్యం.

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ క్యూట్ లవ్ స్టోరీ తెచ్చిన క్రేజ్‌తో కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస ఆఫర్లు అందుకుంటూ ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ‘డ్యూడ్’ మూవీతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయగన్’ లో మమిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది. దీనితో పాటు, ‘ప్రేమలు’ సినిమాలో తనతో పాటు నటించిన సంగీత్ ప్రతాప్‌తో మరోసారి జోడీ కట్టబోతోంది. అలాగే అశోక్ సెల్వన్ సరసన ‘ఇరండు విధానం’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా, స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో కూడా మమిత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమిత తన కెరీర్ , వ్యక్తిగత ఆలోచనలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "సినిమాలు కేవలం డబ్బు, పేరు కోసం కాకుండా.. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలన్నదే నా ప్రధాన లక్ష్యం. సినిమాల ద్వారా లభించే ఆ ప్రేమతోనే ఒక చక్కటి కుటుంబాన్ని, బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాను. ఎప్పుడో ఒకరోజు భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నేను గడిపిన కాలం, నా సినిమా ప్రయాణం నాకు ఎనలేని ఆనందాన్ని ఇవ్వాలి. అలాంటి మధురమైన జ్ఞాపకాల కోసమే నేను ఈ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. మమిత చేసిన ఈ క్లాసిక్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె ఆలోచనా విధానాన్ని చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.






