SkyForce : ఆ బాలీవుడ్ హీరో సినిమాకు ఫ్రీ టికెట్లు... కారణం ఇదేనా!

by Muthe.Rajitha |

బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) న‌టించిన తాజా చిత్రం స్కై ఫోర్స్‌’(Sky Force). ఈ సినిమాకు సందీప్‌ కెవ్లానీ, అభిషేక్ క‌పూర్ సంయుక్తంగా ద‌ర్శక‌త్వం వ‌హించారు.

SkyForce : ఆ బాలీవుడ్ హీరో సినిమాకు ఫ్రీ టికెట్లు... కారణం ఇదేనా!
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) న‌టించిన తాజా చిత్రం స్కై ఫోర్స్‌’(Sky Force). ఈ సినిమాకు సందీప్‌ కెవ్లానీ, అభిషేక్ క‌పూర్ సంయుక్తంగా ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా.. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్‌ కౌర్‌ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్‌(JIO Studioes), మడాక్‌ ఫిల్మ్స్(MUDAK Films) బ్యాన‌ర్‌ల‌పై దినేశ్‌ విజన్ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ప్రేక్షకులకు బంప‌రాఫ‌ర్ ప్రక‌టించింది చిత్రబృందం. ఈ సినిమాకు బుక్ మై షోలో రూ.250 విలువైన కూప‌న్ కోడ్ ఇవ్వనున్నట్లు ప్రక‌టించింది. SkyForce250 అనే కూప‌న్ కోడ్‌ని ఎంట‌ర్ చేస్తే ఫ్రీగా సినిమా చూడ‌వ‌చ్చని తెలిపింది. ఈ ఆఫ‌ర్ విడుద‌ల రోజైన 24 నుంచి రిప‌బ్లిక్ డే వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను పోంద‌డానికి యూజ‌ర్లు మొబైల్ నెంబ‌ర్‌తో లేదా ఈమెయిల్‌తో లాగిన్ అవ్వవ‌ల‌సి ఉంటుంద‌ని ప్రక‌టించింది. ఫెయిల్ టాక్ మూటగట్టుకోకుండా.. ఫస్ట్ డే హౌస్ ఫుల్ అని చెప్పుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని నెటిజన్స్ తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

Next Story