Heroes: రాజకీయ వేదిక మీద నలుగురు అగ్ర హీరోలు.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్

by Gantepaka Srikanth |

సాధారణంగా సినిమా హీరో(Hero)లు రాజకీయ వేదికల్లో అరుదుగా కనిపిస్తుంటారు.

Heroes: రాజకీయ వేదిక మీద నలుగురు అగ్ర హీరోలు.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సినిమా హీరో(Hero)లు రాజకీయ వేదికల్లో అరుదుగా కనిపిస్తుంటారు. ఒకవేళ కనిపించినా ఒకరు పాల్గొనే వేదిక మీద మరొకరు పాల్గొనకుండా జాగ్రత్త పడతారు. అలాంటి ఒకే వేదికగా ఏకంగా నలుగురు అగ్రహీరోలు దర్శనమిచ్చారు. ఈ అరుదైన ఘట్టం మహారాష్ట్ర(Maharashtra)లో ఆవిష్కృతం అయ్యింది. గురువారం మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాధాకృష్ణ(Governor Radhakrishna) ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde), అజిత్‌ పవార్(Ajit Pawar) ప్రమాణం చేశారు. ఈ ‘మహా’ ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM MODI), అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు బాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్(Shahrukh Khan), అమీర్ ఖాన్(Aamir Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), రణ్‌బీర్ కపూర్‌(Ranbir Kapoor)లు పాల్గొన్నారు. అయితే, ఒక రాజకీయ వేదికమీద నలుగురు అగ్రహీరోలు కనిపించడం ఇదే తొలిసారి. దీంతో నలుగురు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.




Next Story