దీపావళి బరిలో నాలుగు సినిమాలు..ఇక థియేట‌ర్లు బ్లాస్ట్ కావాల్సిందే

by velandi.Saikiran |

ఈ సినిమాను ఈనెల 17వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

దీపావళి బరిలో నాలుగు సినిమాలు..ఇక థియేట‌ర్లు బ్లాస్ట్ కావాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దీపావళి పండుగ వచ్చేస్తోంది. వ‌చ్చే వార‌మే దీపావళి ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే గతంలో లాగా ఈసారి పెద్ద హీరోల సినిమాలు లేవు. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఈ సారి దీపావళి కానుకగా తెలుగులో ఏకంగా నాలుగు కొత్త సినిమాలు రాబోతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా, శ్రీనిధి శెట్టి కాంబినేషన్ లో తెలుసు కదా అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 17వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

ఇదే రోజున ప్రదీప్ రంగనాథన్ అనే కుర్ర హీరో చేసిన డ్యూడ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ప్రియదర్శి, నిహారిక నటించిన మిత్ర మండలి ఈనెల 16వ తేదీనే రిలీజ్ కాబోతుంది. ఇక గత దీపావళికి క సినిమాతో బంపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. K-Ramp సినిమాతో ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నాలుగు సినిమాల టీజర్లు అలాగే ట్రైలర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మరి తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారో చూడాలి.

Next Story