- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫౌజీ లేటెస్ట్ అప్డేట్.. 80% పూర్తైంది.. మిగిలింది ఆ సీన్స్ మాత్రమే
ఫౌజీ షూటింగ్ ఇప్పటివరకు సుమారు 80% షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో కేవలం మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌజీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటివరకు సుమారు 80% షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో కేవలం మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అవి పూర్తయితే ఈ సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లే అని టాక్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాల్లో ప్రభాస్ చాలా అందంగా వింటేజ్ లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ చిత్రంతో పాటు స్పిరిట్, కల్కి 2 చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతోంది.






