- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు.. రిలీజ్ ఎప్పుడంటే?
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి(Kiriti Reddy) హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి(Kiriti Reddy) హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రాధా కృష్ణ(Radha Krishna) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ‘జూనియర్’ పేరుతో రాబోతోంది. ఇక ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జెనీలియా(Genelia) ఓ కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో రవిచంద్రన్(Ravichandran) కిరీటి తండ్రిగా నటించనున్నారు.
అయితే రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్సాన్స్ లభించగా.. అంతా రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ‘జూనియర్’ విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమా జూలై 18న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు. ఇక ఇందులో ఓ ఫైల్ పట్టుకుని శ్రీలీల కనిపించగా.. జెనీలియా మాత్రం కోపంగా చూస్తున్నట్లు ఉంది. కిరిటీ స్మైల్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు.






