Fish Venkat: సాయం అందకే నాన్న చనిపోయారు.. ఫిష్ వెంకట్ మృతిపై కూతురు ఎమోషనల్ కామెంట్స్

by Chukka Sudharani |

గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్.. నిన్న రాత్రి మృతి చెందారు.

Fish Venkat: సాయం అందకే నాన్న చనిపోయారు.. ఫిష్ వెంకట్ మృతిపై కూతురు ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్.. నిన్న రాత్రి మృతి చెందారు. ఈ తరుణంలో ఫిష్ వెంకట్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఫిష్ వెంకట్ కూతురు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘నాన్నకు మెయిన్‌గా కిడ్ని ప్రాబ్లెం ఉంది. బెటర్ ట్రీట్మెంట్ కోసం పీఆర్‌కే హాస్పటల్‌కు వెళ్లాము. ఫస్ట్ హాస్పటల్‌లో వారం రోజులకే మాకు రూ. 4లక్షల పైనే అయింది. తర్వాత పీఆర్‌కే హాస్పటల్‌కు వచ్చాక వాళ్లు ట్రీట్మెంట్ బాగా చేశారు. వాళ్లు చాలా ట్రై చేశారు కానీ, నాన్నకు లివర్ కూడా పాడై పోయింది అంటా. మొత్తం బాడీ అంతా బ్లెడ్ ఇన్ఫెక్షన్ వచ్చి.. అది బ్రెయిన్‌కు ఎక్కి మూడు రోజుల నుంచి 80 శాతం కోమలోనే ఉన్నారు. కొంచెం కొంచెం కళ్లు తెరిచి చూసే వాళ్లు అంతే.

నాన్నను సరైనా ట్రీట్మెంట్ అందాలి అంటే రూ. 50 లక్షలు వరకు అవుతుంది అన్నారు. మా దగ్గర అంత మనీ లేక.. ఇండస్ట్రీలో చాలా మందిని సహాయం కోసం అడిగాము. కానీ ఎవరు ముందుకు రాలేదు. దిల్ రాజు అసిస్టెంట్ హాస్పటల్‌కి వచ్చి అన్నీ కనుకున్నారు. బిల్ ఎంత అవుతుంది ఏంటీ అని.. కానీ వెళ్లిన తర్వాత మాత్రం ఫోన్ లేదు ఏమి లేదు. మేము చేసిన లిఫ్ట్ చేయలేదు. ఇలా సోనుసూద్ నుంచి కూడా మాకు ఎటువంటి సహాయం అందలేదు. విశ్వక్ సేన్ ఇక్కడ లేకున్నా కూడా రూ. 2లక్షల చెక్ ఇచ్చి పంపించారు. జెట్టి మూవీ హీరో కృష్ణ కూడా రెండు లక్షలు పంపించారు. ఇక వీళ్లు మాత్రమే.. ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. ఎంతో మందిని వేడుకున్నాము. కనీసం ఎవరు కూడా ఎలా ఉంది ఏంటీ అని కాల్ కూడా చేయలేదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. లింక్


Next Story