- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫస్ట్ టైమ్ OTT సినిమా థియేటర్‌లో రాబోతుంది.. అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సుమంత్(Sumanth) నటించిన 'అనగనగా'(Anaganaga) చిత్రానికి ఓటీటీ(OTT)లో అనూహ్య స్పందన లభిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సుమంత్(Sumanth) నటించిన 'అనగనగా'(Anaganaga) చిత్రానికి ఓటీటీ(OTT)లో అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో సుమంత్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో అడివి శేష్(Adivi Sesh) గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. ‘నా సినిమాకు ఇంత మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా చిత్రానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫర్ ది ఫస్ట్ టైం ఓటీటీ సినిమా థియేటర్లలో రాబోతుంది. సాధారణంగా సినిమాలు ఫస్ట్ థియేటర్లలో వస్తాయి ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది.
కానీ మా సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్లలోకి వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎందుకు ఈ మూవీను థియేటర్లలో రిలీజ్ చేయలేదు అని అడిగేవారే. అందుకే పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ వారం నుంచి లిమిటెడ్‌గా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఫస్ట్ విజయవాడ, వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత వారం నుంచి మరిన్ని స్క్రీన్‌లో రిలీజ్ చేస్తాము’ అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో కాజల్ చౌదరి(Kajal Choudary) హీరోయిన్‌గా నటించింది. ఇక దీనికి సన్నీ సంజయ్(Sunny Sanjay) దర్శకత్వం వహించగా.. గడ్డం రాకేష్ రెడ్డి(Gaddam Rakesh Reddy), రుద్ర ముదిరెడ్డి(Rudra Mudireddy) సంయుక్తంగా నిర్మించారు. అయితే చందు రవి(Chandu Ravi) సంగీతం అందించిన ఈ సినిమాలో మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.






