- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకర్ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. పెప్పీ మెలోడీ రాబోతుందంటూ పోస్ట్
చార్మింగ్ స్టార్ శర్వా నంద్ ప్రజెంట్ తన 36వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా నంద్ ప్రజెంట్ తన 36వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. ‘బైకర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా బైకర్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు శర్వానంద్, మాళవిక నాయర్ ఇద్దరు కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇప్పటి వరకు బైకర్ వేగాన్ని చూశారు కదా.. ఇప్పుడు ఒక పెప్పీ మెలోడీ కోసం సమయం ఆసన్నమైంది.. బైకర్ ఫస్ట్ సింగిల్ ‘ప్రీటీ బేబీ’ ప్రోమో నవంబర్ 11న విడుదల కాబోతున్నది.. సిద్ధంగా ఉండండి.. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది’ అంటూ తెలిపారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. హై-ఎనర్జీ స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ నుంచి.. ఇప్పటికే వచ్చిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. ఇందులో శర్వా ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతుండగా.. ఫస్ట్ టైమ్ ఇలాంటి జానర్ ఎంచుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. లింక్
- Tags
- Sharwanand
- Biker






