- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. వైరల్‌గా పోస్టర్
రామ్ పోతునేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’.

దిశ, సినిమా: రామ్ పోతునేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘ఆంధ్రాకింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ లోడ్ అవుతోంది... రాపో రాసినది, రాక్‌స్టార్ అనిరుధ్ పాడినది.. ఇది కేవలం సంగీతం కాదు.. లైట్ విత్ లవ్’ అంటూ ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో రామ్ పోతునేని అండ్ భాగ్యశ్రీ బోర్సే లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తుండగా.. మరికొన్ని రోజులు ఈ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. లింక్






