- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dil Ruba: అగ్గిపుల్లె అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు.. ఆకట్టుకుంటోన్న ‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా సినిమా ‘దిల్ రూబా’ (Dil Ruba).

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా సినిమా ‘దిల్ రూబా’ (Dil Ruba). విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లన్ (Ruksar Dillon) హీరోయిన్‌గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దిల్ రూబా’ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రేమికుల రోజు (Valentine's Day) సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
దీంతో రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ (Promotions)లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘దిల్ రూబా’ నుండి ఫస్ట్ సింగిల్ (First single) ‘అగ్గిపుల్లె..’ (Aggipulle) రిలీజ్ చేశారు మేకర్స్. ‘అగ్గిపుల్లె అలా గీసినట్టు.. కోపంగా చూడకే కొట్టినట్టు.. గాలి దుమారమే రేగినట్టు.. ఆవేశమెందుకే నొక్కిపెట్టు...’ అంటూ బ్యూటిఫుల్ మెలొడీతో సాగిన ఈ సాంగ్‌లో కిరణ్ అబ్బవరం, రుక్సర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.






