‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-17 04:55:14  IST  )

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Thaluka).

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Thaluka). ఇక దర్శకుడు పి.మహేష్ కుమార్(P. Mahesh Kumar) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, Y. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్‌గా నటిస్తోండగా ఉపేంద్ర(Upendra) ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్‌ను మేకర్స్ వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా మ్యూజిక్ ద్వయం వివేక్-మెర్విన్ కంపోజ్ చేశారు. ఇక ఈ పాటకు సాహిత్యం రామ్ స్వయంగా అందించడంతో మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘నువ్వుంటే చాలే’ అంటూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రోమోనే సాంగ్‌పై హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ ప్రోమోను చూసేయండి. కాగా ఫుల్ సాంగ్ జూలై 18న రాబోతుంది. Link

Next Story