- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కూర్మ నాయకి’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. మహారాణి లుక్‌లో ఆకట్టుకుంటున్న పోస్టర్
వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కుర్మ నాయకి’(Kurma Nayaki).

దిశ, వెబ్‌డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కుర్మ నాయకి’(Kurma Nayaki). ఇక కొత్త దర్శకుడు హర్షవర్ధన్(Harsha Vardhan) ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే అతను స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) శిష్యుడని తెలుస్తుంది. శేఖర్ చంద్ర(shekhar Chandra) ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. ఎం ఎం క్రియేషన్స్ బ్యానర్ లో మొదటి సినిమాగా విజిత్ రావు(Vijith Rao) ఈ మూవీని నిర్మించబోతున్నారు. కాగా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. నేడు వరలక్ష్మి శరత్ కుమర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ఎర్రటి చీర కట్టుకుని ఒంటినిండా నగలు పెట్టుకుంది వరలక్ష్మి. అండ్ బ్యాక్ సైడ్‌లో దేవాలయాలు, విచిత్రంగా ఉన్న జంతువు ఫేస్ కనిపిస్తుంది. టోటల్‌గా లుక్ అదిరిపోయింది.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మనుషులకి దొంగలు నుంచి సమస్య ఎదురైనా, దెయ్యాల నుంచి భయం కలిగినా.. ధైర్యం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. తమ సమస్యని విన్న దేవుడు తమ కోసం వస్తాడని, తమని రక్షిస్తారని నమ్ముతారు. అందుకనే ఏ సమస్య వచ్చినా ముందుగా దేవుడినే తలచుకుంటారు. అలాంటిది దేవుడికే సమస్య వస్తే.. అది కూడా మనుషులు వల్లే సమస్య ఎదురైతే.. ఎవరు వచ్చి కాపాడతారు..? మన పురాణాల్లో దేవతలకు సైతం సమస్యలు వచ్చినప్పుడు.. పరిష్కారం కోసం త్రిమూర్తులను ప్రార్థిస్తారు.
ఇక ఆ త్రిమూర్తులు దేవతల సమస్యకు పరిష్కారం చెప్పడం, లేదా వారే రంగంలోకి దిగి ఆ సమస్యని తొలిగించడమో చేస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి కథలు చాలానే విని ఉంటారు. కానీ ఇప్పుడు ఒక సరికొత్త కొత్త వినిపించబోతున్నారు, కాదు కాదు చూపించబోతున్నారు. ఈ కథలో దేవుడికి మనుషులు నుంచే సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి దేవుళ్ళని కాపాడడానికి దెయ్యాలు, దొంగలు వస్తారట. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ ఇప్పుడు ఇదే కథను సినిమాగా తీసుకురాబోతున్నారు. అదే కూర్మ నాయకి సినిమాగా త్వరలో మన ముందుకు రాబోతుంది.






