- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mandadi: ఈ సినిమా హీరో కెరీర్‌లో ఓ మైలురాయి అవుతుంది.. డైరెక్టర్ వైరల్ కామెంట్స్
కమెడియన్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా మారి సినిమాలు తీస్తున్నాడు కోలీవుడ్ (Kollywood) నటుడు సూరి (Suri).

దిశ, సినిమా: కమెడియన్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా మారి సినిమాలు తీస్తున్నాడు కోలీవుడ్ (Kollywood) నటుడు సూరి (Suri). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మందాడి’ (Mandadi). మథిమారన్ పుగళేంది (Mathimaran Pugalendhi) రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్ (Satyaraj), అచ్యుత్ కుమార్, సుహాస్ (Suhas), మహిమ నంబియార్, రవీంద్ర విజయ్, సచన నమిదాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా(Sports action drama)గా రూపొందుతున్న ఈ మూవీ మిస్టర్ ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. ఈ ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. రామనాథపురం తీరప్రాంతాలలో టెస్ట్ షూట్ పూర్తయింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. మానవ సంబంధాలను చాటేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎల్రెడ్ సర్, వెట్రి సర్‌కి థాంక్స్. నటుడిగా సూరి సర్ ఎంచుకుంటున్న పాత్రలు ప్రశంసనీయం. ఈ పాత్రను అతని కోసం రాయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సూరి దూరదృష్టి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మందాడి ఖచ్చితంగా అతని కెరీర్‌లో ఒక ప్రత్యేక మైలురాయి చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో అతని నటన మాత్రమే కాకుండా ఆహార్యం, లుక్, మేకోవర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వెట్రి మారన్ లాంటి సృజనాత్మక నిర్మాత ఈ ప్రాజెక్ట్ వెనుకాల ఉండి మాకు మార్గనిర్దేశం చేయడం ఆనందంగా ఉంది. జివి ప్రకాష్ సంగీతం, ఎస్ఆర్ కతిర్ విజువల్స్ ‘మందాడి’ కి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి’ అని అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ సమకూరుస్తున్నాడు.






