- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beauty: భావోద్వేగాలతో చెప్పే ప్రేమకథ.. రొమాంటిక్ పోస్టర్ వైరల్
డైరెక్టర్ మారుతి (Maruti) ‘బేబీ’ (Baby) తరహాలో మరో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ (youthful love story)ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: డైరెక్టర్ మారుతి (Maruti) ‘బేబీ’ (Baby) తరహాలో మరో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ (youthful love story)ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రజెంటర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘బ్యూటీ’ (Beauty) అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరోహీరోయిన్లుగా నటిస్తు్న్నారు. బాల సుబ్రహ్మణ్యం ఆర్‌వీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రధాన ప్రాతలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుండగా.. తాజాగా ఫస్ట్ లుక్ (First look) పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ టీజర్ (Teaser) అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు ‘భావోద్వేగాల ద్వారా చెప్పే ప్రేమకథ ‘బ్యూటీ’ యొక్క టీజర్ వాలెంటైన్స్ డే సందర్భంగా రాబోతుంది’ అని చెప్పు కొచ్చారు. ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇద్దరు ప్రేమికులు లిప్ టు లిప్ కిస్ చేసుకున్న సన్నివేశం యుత్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. దీంతో ప్రేమికుల రోజు రిలీజ్ కాబోయో టీజర్ ఎలా ఉంటుందా అని మరింత ఉత్కంఠ పెరగడంతో.. వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు యూత్.






