‘K-RAMP’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆ లుంగీని మడత పెట్టి యంగ్ హీరో భలే మాస్‌గా ఉన్నాడే..

by I. Sairam |

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram) న‌టిస్తున్న తాజా చిత్రం ‘కే-ర్యాంప్‌’(K-RAMP).

‘K-RAMP’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆ లుంగీని మడత పెట్టి యంగ్ హీరో భలే మాస్‌గా ఉన్నాడే..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram) న‌టిస్తున్న తాజా చిత్రం ‘కే-ర్యాంప్‌’(K-RAMP). జైన్స్ నాని(Jains Nani) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ యుక్తి తరేజా(Yukthi Thareja) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ(Rajesh Danda), శివ బొమ్మక్‌(Shiva Bommak)లు నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి కిర‌ణ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్రబృదం. ఈ పోస్ట‌ర్‌లో కిర‌ణ్‌.. మాస్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నాడు. లుంగీ చేతుల‌తో కాస్త పైకి ప‌ట్టుకుని స్టైల్‌గా ముందుకు న‌డుస్తూ క‌నిపిస్తున్నాడు. వెనుకవైపు ఫైర్ ఎఫెక్ట్‌లతో తయారైన హార్ట్ షేప్ బాటిల్స్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link

Next Story