- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది స్పెషల్‌గా ‘క్రేజీ కల్యాణం’ నుంచి ఫస్ట్ లుక్
‘క్రేజీ కల్యాణం’ సినిమా నుంచి మేకర్స్ హీరో పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

దిశ, సినిమా: నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ‘క్రేజీ కల్యాణం’ మూవీ నుంచి యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి నటించిన ఉదయ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ రాజ్ ట్రెడిషనల్ వేర్‌లో హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్‌టైన్మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో "క్రేజీ కల్యాణం" సినిమా చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.






