- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT : ఫైనల్‌గా ఓటీటీలోకి ముఫాసా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
హాలీవుడ్(Hollywood)తో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘ది లయన్ కింగ్’ (The Lion King) చిత్రం ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో అందరికి తెలిసిందే.

దిశ, సినిమా: హాలీవుడ్(Hollywood)తో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘ది లయన్ కింగ్’ (The Lion King) చిత్రం ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి చిన్న పిల్లలతో సహా పెద్దల్నీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. డైరెక్టర్ బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద స్టోరీని సింహాలకు అన్వయిస్తూ తెరపై చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న వచ్చి హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
ఇక పలు బాషల్లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ అందించగా.. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan), చిన్నప్పటి రోల్‌కు ఆయన కొడుకు అబ్రహం వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే.. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఓటీటీలోకి గతనెల ఫిబ్రవరి 18 నుంచే అందుబాటులోకి రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. రిలీజ్ కాలేదు. కానీ, ఇప్పుడు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ జియో హాట్‌స్టార్ (JioHotstar) అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అలరించిన ‘ముఫాసా’ మార్చి 26 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






