Andhra King Taluka: రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ ప్రారంభం

by Kodari Anjali |   (  Updated:2025-06-29 15:22:51  IST  )

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Andhra King Taluka: రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది.

టాప్ టెక్నిషియన్స్ తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా.. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇక చిత్రంలో ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ‘ఆంధ్ర కింగ్ తాలూక’ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా నేడు ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్ గా పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Next Story