- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీమెల్ యాక్టర్స్‌కు కూడా ఆ స్టామినా ఉంటుంది.. అందుకే వారికి డబ్బులు ఎక్కువ ఇస్తారు.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh), హీరో సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh), హీరో సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu). ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధిక ఎల్ నిర్మించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో జూలై 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈక్వల్ పే గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘రెమ్యునరేషన్ అనేది మహిళలు – మగవాళ్లకు సంబంధించినది కాదు. ఇందులోకి ఈ క్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్థం కాదు.
ఒక మేల్ యాక్టర్ థియేటర్‌కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫిమేల్ యాక్టర్‌కి కూడా ఉందంటే ఇవ్వొచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్‌కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు. ఈ హీరోయిన్‌తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వొచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్‌కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్‌కి తీసుకొస్తే ఇవ్వొచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు’ అని తెలిపింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






