- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ‘ఫౌజీ’.. ఏకంగా అక్కడికి షిఫ్ట్
"ఫౌజీ" చిత్రం ఈ ఏడాది విడుదల కావడం కష్టమేనని, వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం క్రితమే హను రాఘవపూడి కాంబినేషన్‌లో "ఫౌజీ" అనే సినిమాను ప్రారంభించాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. మొదట ఈ సినిమాను దసరా కానుకగా లేదా ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇప్పటికే మేజర్ షూటింగ్ భాగం పూర్తవడంతో ఈ సినిమా కచ్చితంగా 2026లోనే విడుదల అవుతుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఈ మూవీలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో ఆ పనులకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావడం కష్టమేనని, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.






