Imanvi: ‘ఫౌజీ’ హీరోయిన్ పాకిస్తాన్ మిలిటరీ అధికారి కూతురా.. అసలు నిజం బయటపెడుతూ బిగ్ షాకిచ్చిన ఇమాన్వి (పోస్ట్)

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఫౌజీ’(Fauji).

Imanvi: ‘ఫౌజీ’ హీరోయిన్ పాకిస్తాన్ మిలిటరీ అధికారి కూతురా.. అసలు నిజం బయటపెడుతూ బిగ్ షాకిచ్చిన ఇమాన్వి (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఫౌజీ’(Fauji). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కొత్త హీరోయిన్ ఇమాన్వి(Imanvi) డార్లింగ్‌తో రొమాన్స్ చేయనుంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్‌గా నటించబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. ఒక్కసారిగా ఇమాన్వి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమెను ‘ఫౌజీ’ చిత్రం నుంచి తొలగించాలనే పోస్టులు దర్శనమిస్తున్నాయి. అసలు కారణం ఏంటంటే.. పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ సంఘటనపై యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పాకిస్తాన్ హస్తం ఉందనే చర్చ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇమాన్వి పాక్ మాజీ మిలిటరీ అధికారి ఇక్బాల్ కూతురని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన వారంతా పాక్ నటులకు భారతీయ సినిమాల్లో అవకాశం ఇవ్వడం ఏంటని విమర్శలు చేస్తున్నారు.

తాజాగా, ఈ విషయంపై ఇమాన్వి స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ నోట్ షేర్ చేసింది. ‘‘మొట్టమొదట పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనకు నా అత్యంత హృదయపూర్తక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అమాయకుల ప్రాణాలను కోల్పోవడం బాధాకరం. ఈ విషయం నా హృదయాన్ని బరువెక్కేలా చేస్తోంది. హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా కాంతిని, ప్రేమను పంచడం ఎల్లప్పుడూ లక్ష్యం అయిన వ్యక్తిగా మనమందరం ఒక్కటిగా కలిసి వచ్చే రోజు త్వరలో చూడాలని నేను ఆశిస్తున్నాను. అయితే నా గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయి. దానిపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. విభజనను సృష్టించడానికి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఆన్‌లైన్‌లో నా గురించి, నా కుటుంబం గురించి పుకార్లను సృష్టిస్తున్నారు. అయితే మిలిటరీ ఆఫీసర్ కూతురు అని అంటున్నారు.

మొదటిది, నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీ వారితో ఇప్పటివరకు సంబంధం కలిగి లేరు. అయితే కొంతమంది వారి ప్రయోజనం కోసం ఆన్‌లైన్‌లో అబద్ధాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా నిరుత్సాహకరమైన విషయం ఏంటంటే.. చట్టబద్ధమైన వార్తా సంస్థలు జర్నలిస్టులు సోషల్ మీడియాలో ఉన్నవారు కూడా కనీస పరిశోధనలు చేయకుండా పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్. నేను లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో జన్మించాను. నా తల్లిదండ్రులు చట్టబద్దంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారు. USAలో నా యూనివర్సిటీ విద్యను పూర్తి చేశాను. ఆ తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా డ్యాన్సర్‌గా వృత్తిని కొనసాగించాను. ఈ రంగంలో చాలా ఏళ్లు పని చేసిన తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలు అందుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా.

ఇదే చిత్ర పరిశ్రమ నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపించి, కొత్త మార్గాన్ని అద్భుతమైన వారసత్వాన్ని జోడించాలని నేను ఆశిస్తున్నాను. నా రక్తం భారతీయ గుర్తింపు సంస్కృతిని కలిగి ఉంది. నేను ఈ మాధ్యమాన్ని విభజనకు కాకుండా ఐక్యతకు ఒక రూపంగా ఉపయోగించాలని ఆశిస్తున్నాను. విషాదకరమైన ప్రాణనష్టం గురించి మనం దు:ఖిస్తున్నప్పుడు ప్రేమను పంచడం ఒకరినొకరు ఉద్దరించుకోవడం కొనసాగిద్దాం. చరిత్ర అంతటా, కళ అనేది సంస్కృతులు, వ్యక్తులు అనుభవాలలో అవగాహన, తాదాత్మ్యం కనెక్షన్‌ను సృష్టించే ఇక మాధ్యమం. ఈ వారసత్వం నా పని ద్వారా కొనసాగేలా నా భారతీయ వారసత్వం అనుభవాలను మెరుగుపరిచేలా నేను కృష్టి చేస్తాను ఇట్లు మిమ్మల్ని ప్రమించే ఇమాన్వి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చేసిన ప్రభాస్ అభిమానులు ట్రోల్స్‌ను పట్టించుకోకండి మీకు మేము సపోర్ట్‌గా ఉంటాం అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story