Sunil Shetty: నా కూతురు ఇకమై సినిమాలకు దూరంగా ఉంటుంది.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత

by Chukka Sudharani |   (  Updated:2025-05-23 12:29:30  IST  )

బాలీవుడ్ (Bollywood) నటుడు, నిర్మాత సునీల్ శెట్టి (Sunil Shetty) కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అథియా శెట్టి (Athiya Shetty).

Sunil Shetty: నా కూతురు ఇకమై సినిమాలకు దూరంగా ఉంటుంది.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) నటుడు, నిర్మాత సునీల్ శెట్టి (Sunil Shetty) కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అథియా శెట్టి (Athiya Shetty). రొమాంటిక్ యాక్షన్ ఫిలిమ్ ‘హీరో’ చిత్రంలో 2015లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘మోతిచూర్ చక్నాచూర్’ మూవీతో 2019లో కనిపించిన ఈ బ్యూటీ అప్పటి నుంచి సినిమాలకు దూరం అయింది. ఇక 2023లో భారతీయ క్రికెటర్ కెఎల్ రాహుల్‌(KL Rahul)ను పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అసలు అతియా శెట్టి మళ్లీ సినిమాలు తీస్తుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు తండ్రి సునీల్ శెట్టి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఆమె నాకు.. బాబా, నేను సినిమాలు చేయాలనుకోవడం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అథియా ఇప్పుడు తనదైన మార్గాన్ని ఎంచుకుంటోంది.. అందరి దృష్టికి దూరంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story