- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Faria Abdullah: ఈ మూవీలో మా అమ్మ కూడా నటించారు.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ కామెంట్స్
‘జాతి రత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

దిశ, సినిమా: ‘జాతి రత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. వీటిలో ‘గుర్రం పాపిరెడ్డి’ ఒకటి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే.. మా అమ్మ కూడా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేశారు. ఇది ఫ్యామిలీ ప్రాజెక్ట్ కాదు.. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్’ అని తెలిపింది. మూరళీ మనో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేను సద్ది, అమర్ బుర్ర, జయకాంత్ నిర్మిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లింక్






