'స్పిరిట్' అప్‌డేట్ ఎప్పుడన్నా?"..సందీప్ రెడ్డి వంగా కారు ఆపిన అభిమానులు

by Ajay Maddhiboyina |

స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి అంటే చాలు అభిమానులు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. సోషల్ మీడియాలో ఆ సినిమా హీరోతో పాటు దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అప్డేట్ వస్తుందని వరుస పోస్టులు పెడుతుంటారు.

స్పిరిట్ అప్‌డేట్ ఎప్పుడన్నా?..సందీప్ రెడ్డి వంగా కారు ఆపిన అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి అంటే చాలు అభిమానులు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. సోషల్ మీడియాలో ఆ సినిమా హీరోతో పాటు దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అప్డేట్ వస్తుందని వరుస పోస్టులు పెడుతుంటారు. ఇక తాజాగా ప్రభాస్ అభిమానులు ఏకంగా డైరెక్టర్ కారును ఆపి మరీ సినిమా అప్డేట్ గురించి ఆరా తీశారు. సందీప్ రెడ్డి వంగా కారులో వెళుతుంటే ఆపిన అభిమానులు స్పిరిట్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని చెప్పారు. సినిమా నుండి పోస్టరో లేదా ఇంకా ఏదైనా అప్డేట్ ఇవ్వాలని అడిగారు. యానిమల్ సినిమా బాగుందని సందీప్ తో చెప్పారు.

దీంతో సందీప్ త్వ‌ర‌లో అప్డేట్ ఇస్తామని అభిమానుల‌తో అన్నారు. స్పిరిట్ బాగా తీయాల‌ని, ఇక్క‌డంతా ప్ర‌భాస్ అభిమానులే ఉన్నార‌ని ఫ్యాన్స్ ఎంతో ఆనంద‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల‌తో సూప‌ర్ హిట్స్ అందుకోగా ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా స్పిరిట్ తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌ల చేసిన పోస్టర్ అభిమానుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంది.

Next Story