Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన మెగా హీరోయిన్‌ను సెట్ చేయాలంటూ అభిమానుల రిక్వెస్ట్.. ఆమె ఎవరంటే?

by Hamsa |
Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన మెగా హీరోయిన్‌ను సెట్ చేయాలంటూ అభిమానుల రిక్వెస్ట్.. ఆమె ఎవరంటే?
X

దిశ, సినిమా: బాలయ్య(Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja)సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashant Verma) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చి హైప్ పెంచింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెట్స్‌పైకి వెళ్తేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ విడుదల కానప్పటికీ మోక్షజ్ఞ మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఇటీవల మోక్షజ్ఞ సరసన శ్రీలీల(Sreeleela) నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు మోక్షజ్ఞ సినిమాలో మెగా బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury)ని పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ కాంబో అదిరిపోతుందంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా, మీనాక్షి చౌదరి గత ఏడాది మట్కాలో నటించిం మెప్పించింది. ఆ తర్వాత చేసిన గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Advertisement
Next Story