- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ajith Kumar: ఎవరూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోరు.. హీరో నిర్ణయంపై నెటిజన్లు అసంతృప్తి
ఈ ఏడాది ‘గూడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు హీరో అజిత్ కుమార్ (Ajith Kumar).

దిశ, సినిమా: ఈ ఏడాది ‘గూడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు హీరో అజిత్ కుమార్ (Ajith Kumar). అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్, సునీల్, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడదలై బాక్సాఫీస్ వద్ధ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నాడు అజిత్. ప్రస్తుతం అజిత్ కుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోయాడు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘AK64’గా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమా గురించి అజిత్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమా కోసం అజిత్.. తన డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో ‘నాకోసం కథ రాయకండి.. నేను మీ కథలో ఉండాలనుకుంటున్నాను. మీరు నన్ను ఊహించుుకుని కథ రాయాల్సిన అవసరం లేదు.. మీరు ఎలాంటి కథ రాసిన నేను మీ డైరెక్షన్‌లో సినిమా తీయాలి అనుకుంటున్నా’ అని చెప్పారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఏ హీరో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోరు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






