- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aneeth Padda : సినిమాలతో పాటు చదువులోనూ.. అనీత్ పడ్డాపై ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా.

దిశ, సినిమా: ‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఫుల్ ఈమేజ్‌ను సొంతం చేసుకుని వరుస మూవీ ఆఫర్స్ అందుకుంటుంది. ఇక ఎన్ని సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ హీరోయిన్ చదువులో కూడా యాక్టీవ్‌గా ఉన్నట్లు టాక్. అయితే మొదట లవ్ స్టోరీతో ఆకట్టుకున్న అనీత్ ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ఓ హారర్ మూవీతో రాబోతున్నట్లు టాక్. దినేష్ విజయన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘శక్తి శాలిని’లో అనీత్ పడ్డా హీరోయిన్ కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ 24న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుందని తెలుస్తుండగా.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే తన తన కళాశాల చివరి సంవత్సరం పరీక్షలకు హాజరు కానుందని టాక్. రాజకీయ శాస్త్రంలో బి.ఎ. చదువుతున్న అనీత్.. ప్రస్తుతం చదువు, నటన రెండింటికీ సమాన శ్రద్ధ చూపుతోందనే వార్తలు వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
- Tags
- Aneeth Padda






