రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్... హీరో ఏం చేశాడంటే?

by velandi.Saikiran |

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో.. చాలామంది సీనియర్లు కూడా ఉంటారు.

రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్... హీరో ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో.. చాలామంది సీనియర్లు కూడా ఉంటారు. అలాంటి వారిలో సంజయ్ దత్ ఒకరు. 1971లో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన సంజయ్ దత్... ఆ తర్వాత స్టార్ నటుడిగా మారిపోయారు. వందలాది బడా సినిమాలు చేసిన ఘనత సంజయ్ దత్ కు దక్కింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా... ఈ మున్నాభాయ్ సినిమాలు చేసేవాడు.

అయితే అలాంటి సంజయ్ దత్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంజయ్ దత్ అభిమాని చేసిన పని.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఏకంగా 72 కోట్ల ఆస్తిని... సంజయ్ దత్ అభిమాని రాసిచ్చాడు. హీరోలపై అభిమానం చాటుకునేందుకు... ఫ్యాన్స్ చాలా రూపాలు ఎంచుకుంటూ ఉంటారు. కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు నిషా పాటిల్ అనే ఫ్యాన్ తాను చనిపోయే ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు.

మొత్తం 72 కోట్ల ఆస్తిని.. రాసిచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా హీరో సంజయ్ ఓ పేర్కొనడం గమనార్హం. అయితే తిరిగి ఆమె కుటుంబానికి.. ఆ ఆస్తిని ఇచ్చినట్లు తాజాగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సంజయ్ దత్ అలాగే ఆయన అభిమానిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అఖండ అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలలో సంజయ్ దత్ నటిస్తున్నారు.

Next Story