హీరోయిన్ సమంతకు గుడి కట్టిన అభిమాని.. వీడియో వైరల్

by velandi.Saikiran |

టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ( Samantha) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు ఉన

హీరోయిన్ సమంతకు గుడి కట్టిన అభిమాని.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ( Samantha) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ సమంతకు కూడా ఉంటుంది. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత కు పెద్ద హిట్లు లేకపోయినా కూడా... ఆమెకున్న క్రేజీ ఏమాత్రం తగ్గదు. అయితే అలాంటి హీరోయిన్ సమంత కోసం ఓ అభిమాని ఏకంగా గుడి కట్టేశాడు. తమ అభిమాన నటీనటుల కోసం గుళ్ళు ( Samantha Temple) కట్టడం తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఆ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కూడా వచ్చింది. తాజాగా హీరోయిన్ సమంత కోసం... తెనాలికి చెందిన ఓ యువకుడు గుడి కట్టేశాడు.


హీరోయిన్ సమంత మంచి మనసు.. నచ్చి ఆమెకు తాను ఫ్యాన్ అయిపోయానని.. ఆ తెనాలి ( Tenali) కుర్రాడు వెల్లడించాడు. దీంతో తన ఇంటి స్థలం దగ్గరే హీరోయిన్ సమంతకు.. అచ్చం ఆమె తరహాలో విగ్రహం పెట్టి గుడి కట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా... టాలీవుడ్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అక్కినేని నాగచైతన్య కు ( Akkineni Naga chaitanya) విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె లైఫ్ లో పెద్దగా సక్సెస్ మూమెంట్ రాలేదు. వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అవుతున్నాయి. ఇటు తెలుగులో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆమె మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి దాదాపు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.


Next Story