- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ నటుడు మృతి.. పాడె మోసిన స్టార్ హీరో
ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee) కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee) కన్నుమూసిన సంగతి తెలిసిందే. 83 ఏళ్ల వయసున్న దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అయితే దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిన్న ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగాయి.
అయితే ఈ అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) కూడా హాజరయ్యారు. అక్కడ దేబ్ ముఖర్జీ పాడె మోశారు. అనంతరం తండ్రిని కోల్పోయిన అయాన్‌ను ఓదార్చారు. అయితే రణ్‌బీర్ కపూర్ డైరెక్టర్ అయాన్ క్లోజ్ ఫ్రెండ్. ఈ కారణంగానే ఆయన దగ్గరుండి తన ఫ్రెండ్ తండ్రి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.
కాగా దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో నటించి మెప్పించారు. అలా ఏక్ బార్ మూస్కురా దో, జో జీతా వోహి సికందర్, లాల్ పత్తర్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.






