పడటం తప్పు కాదు, పడ్డాక లేవకపోవడమే తప్పు.. విశ్వక్ సేన్ ఎమోషనల్ కామెంట్స్

by I. Sairam |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswaksen) కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫెరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు.

పడటం తప్పు కాదు, పడ్డాక లేవకపోవడమే తప్పు.. విశ్వక్ సేన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswaksen) కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫెరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు. అలాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా అతనికి ఆశించిన విజయం అందడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత కష్టపడినా హిట్టు మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ఫంకీ’(Funky) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. దీనికి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ(Anudeep KV) దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఫంకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించగా.. అక్కడ ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మన సినిమాలు మంచి ఆడుతున్నప్పుడు, మంి విజయం సాధిస్తున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు అది వేరే విషయం. అయితే లాస్ట్ రెండు మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నన్ను నమ్మిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. టైమ్ బాగున్నప్పుడు మనతో అందరూ ఉంటారు. కానీ టైమ్ బాలేనప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళే మనకు చాలా ఇంపార్టెంట్.

నాతో ఇప్పటివరకు ఉన్న వాళ్ళ లవ్‌ను నేను జన్మలో మర్చిపోను. కొంచెం టైమ్ అటూ ఇటూ ఉన్నప్పుడు బ్యాక్ లైన్‌లో ఉన్నవాళ్లు ఫ్రంట్ లైన్‌లోకి వస్తారు మనం చేసిన తప్పులు ఎత్తి చూపడానికి.. అప్పుడు చాలా మంది లో ఫీలవుతారు.. అయితే "పడటం తప్పుకాదు, పడ్డాక లేవకపోవడమే తప్పు". టైమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వర్రీ అవకండి. ఇక ఈసినిమా నేను చాలా క్రూషియల్ సిట్యూవేషన్‌లో వచ్చింది. ఆ దేవుడే నా కోసం డెస్టినిని ఇలా పంపాడేమో అని అనిపిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది’అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story