- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచి రోల్ అని చెప్పి పనిమనిషి క్యారెక్టర్ ఇచ్చారంటూ ఫైమా కామెంట్స్.. నీ మొహానికి అది కూడా ఎక్కువే అంటూ..
'పటాస్' ఫైమా(Faima) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: 'పటాస్' ఫైమా(Faima) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'పటాస్' మాత్రమే కాదు 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లాంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఈ అమ్మడు తన టాలెంట్ తో అవకాశాలు కొట్టేసి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస షోలతో బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయి. స్టార్టింగ్‌లో నాకు సినిమాలు అంటే చాలా భయమేసేది ఎందుకంటే మూవీ షూట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు.
స్టేజ్ వరకే నాకు తెలుసు. మూవీస్‌లో ఎలా చేస్తారో ఆ టేక్స్ ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. అయితే చాలా అవకాశాలు వచ్చినప్పుడు ఒకటి ట్రై చేద్దామని ఓకే చేశాను. అయితే స్టార్టింగ్‌లో నా క్యారెక్టర్ మంచిగా ఉంటది.. నాదే లీడ్ రోల్ అన్నారు. కానీ తీరా సెట్‌కి వెళితే నాకు పని మనిషి క్యారెక్టర్ ఇచ్చారు. అంతేకాకుండా ఒక డైలాగ్ మాత్రమే ఉంది ఈ పాత్రకు. అది ఎడిటింగ్‌లో ఉంచుతారో లేదో కూడా తెలీదు అని నేను చేయను అని చెప్పేశా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు నీ మొహానికి అది కూడా ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






