- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఫెయిల్యూర్ బాయ్స్’ ఓ అద్భుతం
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫెయిల్యూర్ బాయ్స్’. సుమన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిల్మ్స్ బ్యానర్‌పై విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించగా విజయ్ సంగీతం అందించారు.

దిశ, సినిమా : క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫెయిల్యూర్ బాయ్స్’. సుమన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిల్మ్స్ బ్యానర్‌పై విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించగా విజయ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఫెయిల్యూర్ బాయ్స్’ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు బాబు మోహన్.. ‘అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ తెలుగు శ్రీను, శ్రీనివాస్ జమ్మి తదితరులు హాజరయ్యారు.






