'కూలీ'లో సౌబిన్ పాత్రను వదులుకున్న టాలీవుడ్ విలన్ ?

by velandi.Saikiran |

సౌబిన్ షాహిర్ పాత్రను మొదట కూలీ దర్శకుడు లోకేష్... ఈ దయాల్ పాత్ర కోసం పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ను అనుకున్నారట.

soubin shahir
X

soubin shahir 

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా కూలీ. ఈ సినిమా మొన్న ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయి.. అద్భుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. పాన్ ఇండియా స్టార్ నటులందరూ.. ఇందులో కనిపించి మెప్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేయగా... నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ( Soubin Shahir ) అలాగే పూజా హెగ్డే నటించి... ఫుల్ మీల్స్ అందించారు.

ఈ సినిమా మూడు రోజుల్లోనే 335 కోట్లు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో 1000 కోట్లు కూడా వసూలు చేసే ఛాన్సులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సౌబిన్ షాహిర్ పాత్ర చాలా కీలకమన్న సంగతి తెలిసిందే. కథ ఇతని చుట్టే నడుస్తుంది. రజినీకాంత్ ను కూడా ఒకానొక సమయంలో డామినేట్ చేశాడు సౌబిన్ షాహిర్.

అయితే అలాంటి సౌబిన్ షాహిర్ పాత్రను టాలీవుడ్ విలన్ మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదట కూలీ దర్శకుడు లోకేష్... ఈ దయాల్ పాత్ర కోసం పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ( Fahadh Faasil) ను అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో సౌబిన్ షాహిర్ కు ఈ పాత్ర వెళ్ళినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా కోసం సౌబిన్ షాహిర్ కు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ దక్కిందని సమాచారం.

Next Story