Manchu Family: గొడవలపై మోహన్ బాబు ఫ్యామిలీ వివరణ

by Gantepaka Srikanth |

మంచు మోహన్ బాబు(Mohan Babu) కుటుంబంలో గొడవలు చెలరేగాయని.. దీంతో మోహన్ బాబు అతని కుమారుడు మంచు మనోజ్‌(Manchu Manoj)లు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

Manchu Family: గొడవలపై మోహన్ బాబు ఫ్యామిలీ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మోహన్ బాబు(Mohan Babu) కుటుంబంలో గొడవలు చెలరేగాయని.. దీంతో మోహన్ బాబు అతని కుమారుడు మంచు మనోజ్‌(Manchu Manoj)లు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా.. ఈ వార్తలపై మంచు ఫ్యామిలీ(Manchu Family) స్పందించింది. పరస్పర ఫిర్యాదులపై వివరణ ఇచ్చింది. ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా అసత్యాలు ప్రచారం చేయొద్దని మండిపడింది.

ఇదిలా ఉండగా.. ఆస్తుల విషయమై గతకొంతకాలంగా తండ్రి, కొడుకులు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని సమాచారం. ఆదివారం కూడా ఈ డిస్కషన్ మరోసారి వారి మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. గొడవ ముదిరి తండ్రి కుమారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారా? లేదా? అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story