ఆ స్పెషల్ డే నాడు ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి ఎక్జైటింగ్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ (ట్వీట్)

by Mallepaka Hamsa |

నేచురల్ స్టార్ నాని(Nani) ఇటీవల దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ స్పెషల్ డే నాడు ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి ఎక్జైటింగ్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani) ఇటీవల దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘దసరా’ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలతో ‘ది ప్యారడైజ్’(The Paradise) మూవీ చేస్తున్నారు. తెలుగు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్‌లోకి రానున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘ది ప్యారడైజ్’ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నాని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక అదే రోజు శైలేష్ కొలను, నాని కాంబోలో రాబోతున్న ‘హిట్-3’ టీజర్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంత్ తిపిర్నేని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story