- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh).

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్‌సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావటంతో ఈ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చి సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్‌లను కంప్లీట్ చేసిన పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ సినిమా సెట్స్‌కి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు. సినిమా సెట్స్‌లో పవన్ కళ్యాణ్‌తో చిరంజీవి కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు మెగా నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి కలిసి ఓ మల్టిస్టారర్ మూవీ చేయాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల సందడి చేయనుంది. సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా 2025 చివరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.






