ఆ సినిమా తర్వాత నన్ను అందరూ అలా పిలుస్తున్నారు.. బాలయ్య బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ సినిమా తర్వాత నన్ను అందరూ అలా పిలుస్తున్నారు.. బాలయ్య బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది.

బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా(urvashi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కలెక్షన్ల విషయంలో మంచి వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా. దీంతో ఈ మూవీ టీమ్ అంతా ప్రజెంట్ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. డాకు మహారాజ్ అండ్ హీరో బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నా బర్త్‌డే రోజే ‘డాకు మహారాజ్’ రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ఇయర్(2025) నాకు అద్భుతంగా స్టార్ట్ అయిందని భావించా. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి అందరూ నన్ను ‘డాకు మహారాణి’ అని పిలుస్తున్నారు. కావేరి పాత్ర అంత ప్రభావితం చూపింది.

ఒక నటిగా ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రం. గర్భిణీ పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది’ అని చెప్పుకొచ్చింది. అలాగే బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన ఒక లెజెండ్. బాలకృష్ణ పేరు చెప్పగానే పాజిటివిటి పదం గుర్తుకు వస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పగల వ్యక్తి. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. మంచి మనిషి.

అయితే పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. అంతేగాని వారి వయసు ఆధారంగా సినిమా అవకాశాలు ఇవ్వరు. నాకు నచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేశానా లేదా అనేదే ఆలోచిస్తాను. నా దృష్టిలో ఏజ్ అనేది ఒక సమస్య కాదు. ‘అఖండ’(Akhanda) రిలీజైన తర్వాత మా ఇద్దరినీ స్క్రీన్‌పై చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story