‘ప్రతి సినిమా నాకు చివరి మూవీలాగే భావిస్తున్నాను’.. సమంత షాకింగ్ కామెంట్స్.. షాక్‌లో ఫ్యాన్స్

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది.

‘ప్రతి సినిమా నాకు చివరి మూవీలాగే భావిస్తున్నాను’.. సమంత షాకింగ్ కామెంట్స్.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన 4సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య.. స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulupala)తో డేటింగ్‌లో ఉంటూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు.

కానీ, సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా మయోసైటీస్(Myositis) అనే మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నెట్టింట యాక్టీవ్‌గా ఉంటూ హెల్త్ టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది. అయితే సిటాడెల్ సిరీస్ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో మూవీ ప్రకటించలేదు.

దీంతో అసలు సామ్ సినిమాలు చేస్తుందా లేదా అని ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అయితే దీనిపై సమంత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తానెందుకు సినిమాలు చేయట్లేదో క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమా అవకాశాలు లైన్‌లో ఉన్నాయి. కానీ నేనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేను. చేసే ప్రతి మూవీ నాకు చివరి సినిమాలాగే భావిస్తున్నాను. నేను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి.

అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్న. ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man-2)లో రాజీ, సిటాడెల్‌లో పాత్ర అలా చేసినవే. నాకు ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డీకే(Raj &Dk)కు థ్యాంక్స్. ప్రజెంట్ ‘రక్త బ్రహ్మాండ్’(Raktha Brahmand) సిరీస్‌లోనూ చాలెంజింగ్ రోల్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. సామ్‌ను అంతక ముందులా చాలా సినిమాల్లో చూడలేమా అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు బాధపడుతున్నారు.

Next Story